గౌరవనీయులైన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కు,
భారతదేశ చలనచిత్ర చరిత్రలో, క్షమించండి నాకు ఆ విషయమైతే కరక్ట్ గా తెలియదు కాని దక్షిణ భారతదేశ చలన చిత్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా స్నేహితుల కోసం కనీసం పారితోషికం కూడా తీసుకోకుండా ఒక సినిమా చేసిపెట్టిన నటుడు మీరు. (డైనమిక్ మూవీ మేకర్స్ – యముడికి మొగుడు). మీరు నటుడు కావాలనుకున్నపుడు మీతో పాటు మీ సహచరులుగా ఒకే రూమ్ లో కలిసి ఉన్న స్నేహితుల కోసం ఆ సినిమా చేసి పెట్టారు. ఆ సినిమా చేసే టైం కి మీరు నెంబర్ వన్ స్థానం లో కూడా ఉన్నారు. అప్పటి వరకు ఆర్థిక ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న మీ స్నేహితులు ఏ విధంగా నిలదొక్కుకుని ఆర్ధికంగా బలపడ్డారో అందరికీ తెలిసిన విషయమే.
మీరు చలన చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన తర్వాత అభిమానులను సంపాదించుకోవడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టింది. అప్పటి నుండి మీ అభిమానులుగా ఉంటూ మీకు హిట్ వస్తే పండగ చేసుకున్నాం, మీ సినిమా ఫ్లాప్ అయితే నిద్ర పట్టకుండా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు సంఘం లో అభిమానులకు సేవ అనే మార్గం చూపెట్టిన మంచి వ్యక్తి మీరు.
మీరు హీరోగా చేసిన చివరి చిత్రం శంకర్ దాదా జిందాబాద్ వరకు 29 సంవత్సరాలలో దాదాపు మీకు అభిమానులుగా ఏర్పడిన వారు 27 సంవత్సరాలుగా మీ వెన్నంటే ఈ రోజుకు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు.
దాదాపుగా మీ అభిమానుల్లో 90% వరకు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పేదవారే. తప్పుగా అర్థం చేసుకోకండి అన్నయ్య, అటువంటి అభిమానుల కోసం మీరు ఏమి చేయగలిగారు?
2010 ఆగష్టు 2వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా పార్టీ సమావేశం హైదరాబాద్ లో జరిగినపుడు “అన్నయ్య! అభిమానులకు, రాజకీయ నాయకులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉంది” అని నేను చెప్పినపుడు మీరు చెప్పిన సమాధానం ఇప్పటికీ నా గుండెల్లోనే మెదులుతూ ఉంది అన్నయ్యా.
మీరు మాట్లాడుతూ “శేఖర్! మీ గుండెల్లో ఏముందో నా గుండెకు తెలుసు. నా గుండెలో ఏముందో మీ గుండెలకు తెలుసు. నిన్న గాక మొన్న వచ్చిన నాయకులకు ఏమి తెలుస్తుంది?” అన్నారు.
ఈ కమ్యూనికేషన్ గ్యాప్ పోవాలి అంటే మిమ్మల్నే నమ్ముకుని ఉన్న మీ అభిమానులు ఆర్ధికంగా, రాజకీయంగా స్థిరపడాలి. అభిమానులు ఆర్ధికంగా, రాజకీయంగా స్థిరపడాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది.
ఒక పక్కా స్క్రిప్ట్ తో ముప్పై రెండు సంవత్సరాల మీ అనుభవాన్ని రంగరించి ఒక సినిమా ని హీరో గా మీరు కాని, పవన్ కళ్యాణ్ గారు కాని, చరణ్ బాబు కాని నటిస్తూ ఒక లిమిటెడ్ బడ్జెట్ తో సినిమాని మీరే నిర్మిస్తూ రాష్ట్రం లో ఉన్న 23 జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులను, 294 నియోజకవర్గాల అభిమాన సంఘాల అధ్యక్షులను పిలిపించి వారి ద్వారా ఆ సినిమాని డిస్ట్రిబ్యుట్ చేయిస్తూ అభిమానులను ఆర్ధికంగా స్థితిమంతులను చేయగలిగినటువంటి పరిస్థితిని కల్పిస్తే అభిమానే ఒక లీడర్ గా ఎదిగే అవకాశం కల్పించిన ప్రపంచం చలన చిత్ర చరిత్ర లోనే మొట్టమొదటి వ్యక్తి మీరే అవుతారు.
అభిమానులతో రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేయించి వ్యక్తిత్వ పరంగా మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపారు. ఇప్పుడు ఈ విధంగా చేసి ఆర్ధికంగా కూడా నిలబెట్టి భవిష్యత్తులో మంచి లీడర్లుగా తయారు చేయగలరని మీ నుండి ఆశిస్తున్నాం.
మీరు నాయకుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మీరు కొన్ని వందల, వేల మంది నాయకులను తయారుచేయగలరు.
ఇది మీరు చదువుతారో లేదో తెలియదు కాని కనీసం చదివిన వారైనా మీకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం.
మరో జన్మంటూ ఉంటే మీ అభిమానిగానే పుట్టాలని కోరుకుంటున్నాను
- పి.చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు జిల్లా చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షులు
No comments:
Post a Comment